27, జూన్ 2009, శనివారం

వ్యభిచారి

ఒక ధనవంతురాలు కారు దిగి హడావిడిగా ఒక బహుళ అంతస్తుల భవనంలోకి, ప్రవేశించి లిప్టు వైపు నడచుకుంటూ వెళుతున్నారు. వెనుకనుంచి, మేడం, మేడం అంటూ అరుపులు. ఆవిడ చిరాకుపడుతూ ఆగింది. ఓక సెక్యూరిటి గార్డు వచ్చి మేడం మీరు వ్యభిచరించారు అన్నాడు. అతని చెంప చెళ్ళు మంది. మేడం ఎందుకు కొట్టారు అన్నాడు. నేను వ్యభిచరించడమేమిటి అని ప్రశ్నించింది. మీరు ఎంట్రన్సులో పెర్మిషను తీసుకోకుండా లోపలికి వచ్చారు. అది నిజమే, నేను హడావిడిలో ఉన్నాను, కానీ దానికి మీరన్నదానికి సంబందమేమిటి అంది. అనుమతితో ఈ భనంలోకి ప్రవేశించాలి, అది ఇక్కడ నియమం. మీరు ఆ నియమాన్ని అతిక్రమించారు. నియమాలను అతిక్రమించడాన్ని సంస్కృతంలో వ్యభిచరించడం అంటారు.
పైన సంఘటనలో వ్యభిచరించడం అనే పదం పుట్టినప్పుడు వాడిన అర్థానికి, ఇప్పుడు మనం వాడుతున్న అర్థానికి చాలా చాలా భేదం ఉంది.
ఆ పదాన్ని అప్పటి అర్థంతో ఇప్పుడు వాడితే వచ్చే అనర్థమేమిటో అందరికీ తెలుసు.
పదాల అర్థాలకు డిక్షనరీల సాక్ష్యం చూపించవచ్చు. కానీ వ్యవహారంలో ఉన్న అర్థంలో వాడకపోతె గందరగోళమే.
పదాలు, సామెతలు అవిపుట్టినప్పటి నేపథ్యనికి సరిపోతాయి. కాని నేపథ్యం మారినపుడు, వాటి రిలవెన్సూ పోతుంది. ప్రస్తుత పరిస్తితులకు అనుగుణంగా క్రొత్త పదాలు, సామెతలూ తయారవుతూనే ఉన్నాయి. క్రొత్తది వస్తే పాతది సహజంగానే మరుగున పడిపోతుంది. పాతది పోవాతలంటే పాతది పోవాలి అని మరలా కెలికి గుర్తు చేయకూడదు.
కాలేజీలో ఉన్నపుడు, టీచర్ సైలెన్స్ అని అరిస్తే అందరూ సైలెన్స్ అని అరిచేవారు. సైలెన్స్ కావాలంటే అందరూ సైలెన్స్ అని అరవకూడదు.

6 కామెంట్‌లు:

  1. బాగుంది అంశం. మీరు చెప్పినవి కాకుండా మరొక కోవకి చెందినవీ వున్నాయండి. ఆ మధ్య మా ఇంటికి వచ్చిన బంధువొకాయన పిల్లలకి బాగ నచ్చారు. ఇంకొన్ని రోజులు వుంటే బాగుంటుందన్న అభిలాష మా పిల్లలనోటివెంట ఇలా వెలువడింది. "అంకుల్ ని ఇంకా వుంచుకోవా?" అలాగే throw a party అన్నది "డిన్నర్ పడేస్తావా?" ఇలా, వాళ్ళకి సరైన పద ప్రయోగంలా తోచినా అర్థం మారి అపభ్రంశం అవుతుంది ఆ సంభాషణ. ఈ వాడుక మాటలే కాదండి, వ్రాతల్లో కూడా ఒక చిన్న అచ్చుతప్పుతో అర్థం మారిపోతుంది. ఉదాహరణకి, మొన్నొక రోజు ఆఫీసులో మా పనులు bugs గా వ్యవహరిస్తాము. నాకు కొంచం తీరిక చిక్కి కాస్త పని ఎక్కువ వున్న ఒకరిని do u want to give me a bug అనబోయి do u want to give me a hug? అని ఈ-మెయిలు పంపాను. అంతా స్నేహంగా మెలుగుతాము కాబట్టి అనర్థమేమీ జరగలేదు.

    రిప్లయితొలగించండి
  2. భాషను గురించి.. పదాల వాడుకలో...జనరేషన్ గాప్ ... గురించి..బాగా చెప్పారు..

    రిప్లయితొలగించండి
  3. ఉష గారు, తెలుగబ్బాయి గారు,
    మీ వ్యాఖ్యలకు ధన్యవాదములు. ఉషగారు, నావేరొక టపాలో మీ వ్యాఖ్య, శ్లేష ధ్వనించింది అని.
    విశ్లేషణా శ్లేష అది. డైరక్టుగా చెప్పకుండా అన్యాపదేశంగా చెప్పడం మీరు గమనించే ఉంటారు. చాదస్తపు మొగుడు చెబితే వినడు, గిల్లితే ఏడుస్తాడు అనే సామెత వినేఉంటారు. ఇక్కడ నాఅబిప్రాయముకంటే చెప్పేది ముఖ్యము, కాబట్టి ఈ ఇండైరక్టు పద్దతి. చెప్పాలనుకుంటున్న విషయము, దాన్ని చెప్పే పద్దతి, చివరగా నా కంక్లూజను. చదువరులే వారి వారి అనుభవాలతో, వారి పద్దతిలో అర్థం చేసుకుంటారు. నేను చెప్పాలను కుంటున్న దానికి భిన్నంగా అనిపిచ్తే విమర్శలెపుడూ ఉంటాయి. నేను నా వివరణ ఇస్తాను. ఎవరినీ నొప్పించకుండా నేను సమాజమునుండి నేర్చుకున్న మంచిని, పరిస్తితుల కనుగుణంగా చెప్పడానికి ప్రయత్నిస్తుంటాను. ఎదుటివారిని వేళాకోళం చేస్తే ఎవరూ భరించరూ. మిగిలినవాళ్ళూ ఒకరినే వేళాకోళం చేస్తారు. అదే అక్కడ లేని కల్పిత వ్యక్తి మీద జోక్ చెబితే, అది అందరికీ వినోదం, ఎవరూ బాధపడరు. ఇదీ నాకు తెలిసినది. మీ సలహాలకు స్వాగతం, అవి నాకు అమూల్యం.

    రిప్లయితొలగించండి
  4. ఉష గారు,
    మీరు కొన్ని భాషా జోకులు ( ఐ మీన్ బాష ప్రయోగ జోకులు) చెప్పారు కాబట్టి, నేను ఒక ఆసక్తి కర సంఘటన చెబుటాను.
    క్రోద్ది రోజులక్రితం విదేశం వెళ్ళిన ఒక భర్త స్వదేశంలో ఉన్న భార్య తో చాటింగ్ చేస్తున్నాడు. ఆవిడ how are you
    అని టైపు చేసింది. ఆయన అన్నం తింటూ ఎడమ చేత్తో how are you అని టైపు చేశాడు. వెంటనే చాటింగ్ కట్ అయింది. ఆరగంట తరువాత అతని మిత్రులందరూ ఆయనకు ఫొన్ చేసి, మీ ఆవిడ నీ గురించి Enquiry చేస్తుంది మా అయన ఏవత్తినైనా తగులుకున్నాడా అక్కడ అని, అసలేమి జరిగింది. ఏమి జరుగుతుందో అర్థం కాలా. ప్రొద్దునకూడా బాగానే మాట్లాడిందే సాయంత్రానికి ఏమయ్యింది దీనికి అనుకుని, ఫొన్ చేస్తే ఫోన్ లేపదు. అంతా కంగారు, బుర్ర గోక్కుంటూ యదాలాపంగా కంప్యూటర్ వైపు చూస్తే తెలిసింది జరిగిన డామేజీ కి కారణమేమిటో. ఈయన ఎడమచేత్తో how బదులు who అని టైపు చేయడం కనిపించింది.

    రిప్లయితొలగించండి
  5. డియర్ పునర్వసు!

    భాషా ప్రయోగాల గురించి మీరు వ్రాసినది బాగుంది.

    ఇంగ్లీషు క్లాసిక్స్ లో ఇప్పుడు మనం 'ఇంటర్ యాక్షన్ ' అని వ్యవహరించేదాన్ని 'ఇంటర్ కోర్స్ ' అనేవారు!

    ఇప్పుడు మరి పత్రికల్లో కూడా 'ఇంటర్మీడియేట్' ని యధేచ్చగా 'ఇంటర్ కోర్స్ ' అని వ్రాసేస్తున్నారు!

    ఈ పేజీలో మీ టపాలన్నీ చదివి చాలా ఆనందించాను--నాతో భావసారూప్యం వున్నవారొకరు దొరికారు--అని!

    చాలా సంతోషం! కొనసాగించండి!

    రిప్లయితొలగించండి