26, జూన్ 2009, శుక్రవారం

తెలియాల్సినవి - తెలుసుకోవాలనుకుంటున్నవి

ఒకసారి ఒక పెద్దాయన అంటుంటే విన్నాను. ( ఆయన ఒక ఉర్దూ పత్రికలో సబ్ ఎడిటర్ అట.)
" ఆజ్ కల్ లోగ్ అప్నా బచ్చొంకో ఇంజనీర్ యా డాక్టర్ బనానేకో సోచ్ రే, మగర్ కోయీ ఉన్ కో ఇన్సాన్ బనానేకో నై సోచ్ రే"
ఉర్దూ లో ఆద్మీ, ఇన్సాన్ అనే రెండు పదాలు ఉన్నాయి. రెండూ సమాన అర్దాలలోనే వాడతారు, కాని భేదం ఉన్నది. తెలుగులో వాటికి సమానమైన పదాలుంటే తెలుపగలరు. డెఫినిషన్లు చెప్పలేక పోయినా ఏ అర్దాలలో వాడతారో వ్రాస్తాను. తప్పులుంతే తెలుపగలరు.
ఆం ఆద్మీ - అనే ప్రయోగంలో చూచించబడేది, సామాన్య గుణాలుకలిగిన (ఆకలి, కోపము, బాధ, అప్పులు, పిల్లలు వగైరా వగైరా..) మనిషి.
వీటన్నిటితోపాటు, కరుణా, ప్రక్కవారు బాధ పడుతుంటే స్పందించడమూ, మర్యాద ఇచ్చి పుచ్చుకోవడమూ వగైరా... ఉన్నవారిని ఇన్సాన్ అని అంటారు. ఇన్సానియత్ అనేది మానవత్వం అనే అర్థంలో వాడతారు.
అంటే పుట్టుకతో అందరూ మనుషులైనా మానవత్వము గల మనుషులవడం మనిషి మెదటి పని.
సమాజంలో మనిషి బ్రతకాలంటె (సమాజం బ్రతకాలంటే) ప్రతి మనిషికీ తెలివితేటలకంటే మానవత్వము ముఖ్యము.
చదువుతో ఇవి రావు. చదువు సహజ గుణాలను పెంచుతుంది అని మరొక మహానుభావుడు సెలవిచ్చారు.
అంటే ఇంజనీరింగు చదివిన చెడ్డ వాడు చెడ్డ ఇంజనీరు అవుతాడు. అలాగే ఇతర చదువులూ.
బుర్ర చాకు లాంటిదైతే చదువు దానికి పదును వంటిది. పదునెక్కిన చాకుతో నేర్పుగా బ్రతికించే ఆపరేషన్లు చేయవచ్చు, మర్డర్లూ చేయవచ్చు.
మనిషిపై సమాజం ప్రభావం ఉంటుంది. సమాజంలో మంచివారూ ఉన్నారు, చెడ్డవారూ ఉన్నారు. మనము సమాజంలో ఉన్నాము. మనచుట్టూ చెడ్డా ఉంది, మంచీ ఉంది. మంచిని మాత్రమే గ్రహించాలి. మంచిని మాత్రమే వెలిబుచ్చాలి. మనలో తయారయే చెడుని దిగమింగేయాలి. ఎందుకంటే మనము ఈ రోజు వెలువరించే చెడు ఎంతమంది చెడ్డవారవడానికి కారణమవుతుందో, తరువాత ఆ చెడ్డవారే మనకు ఇబ్బంది కలిగిస్తారేమో. మనము సమాజానికి ఇచ్చేది తిరిగి మనకు రావడమనేది ఇదే.
దీనినే ఒక సంస్కృత శ్లోకంలో చెప్పారు. దానర్థం:
మనిషి పనేంటంటే చెడ్డవాడు మంచివాడుగా మారాలి, మంచివాడు శాంతి పొందాలి. శాంతి పొందినవాడు,
బంధవిముక్తుడవాలి. బంధవిముక్తుడైన వాడు ఇతరులను బంధవిముక్తులను చేయాలి.
ఇప్పటివరకూ చెప్పుకున్నవన్నీ మనకు తెలియాల్సినవి.
మనిషి తెలుసుకోవాలంకుంటున్న విషయాలు అనంతము. ఎన్ని తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాలనుకుంటున్న వాటి లిస్టు పెరుగుతూనే ఉంటుంది. చిన్నప్పుడు చదువుకున్నవి ఇప్పుడు తప్పు అనిపించవచ్చు. పదేళ్ళ క్రితం చదివిన కోర్సు ఇప్పటి ఉద్యోగానికి పనికి రాక పోవచ్చు. ఇవన్నీ చదువులు. మనము చదవాలనుకున్న చదువులు. ఉద్యోగం కోసం చదివే చదువులు. తెలుసుకోవాలనుకున్న విషయాలు. మనలో మార్పొస్తే మన ఆశలు, ఆశయాలలో మార్పొస్తుంది. గతములో నేర్చుకున్నది టైమువేష్టు అనిపిస్తుంది.
తెలియాల్సినవి తెలుసుకున్న తరువాత తెలుసుకోవాలనుకుంటున్నవి ఎన్నయినా తెలుసుకోవచ్చు.
మొదటివి తెలియకపోతే తరువాతవి ఎన్ని తెలుసుకున్నా మనిషి (ఆద్మీ) మనిషిగానే ఉంటాడు. మనీషి (ఇన్సాన్) కాడు.

8 కామెంట్‌లు:

  1. తెలివితేటలకన్నా మానవత్వం ముఖ్యం బాగా చెప్పారు.ఎన్నో తెలివితేటలు,జ్ఞానం ఉన్నవారు దారుణ ప్రవృత్తి కలిగి ఉండడం, ఏమాత్రం అక్షరజ్ఞానం లేనివారు ఎంతో దయాగుణాన్ని, మానవత్వంతో మెలిగే వాళ్ళను ప్రతి నిత్యం చూస్తూనే ఉన్నాము కదా !

    రిప్లయితొలగించండి
  2. ఆద్మీ-ఇన్సాన్ పదాల్ని alternative గానే వాడుతారు. తెలుగులో ‘మనిషి’కీ ‘వ్యక్తి’కీ అలాంటి సూక్షమైన తేడా ఉంది.పుట్టిన ప్రతిఒక్కరూ మనిషే కానీ వ్యక్తిత్వం సంతరించుకుంటేనే వ్యక్తి. మనం దీన్నీ alternative గా వాడేస్తామంతే!

    రిప్లయితొలగించండి
  3. మహేష్ కుమార్ గారు
    వాడడం కాదు నేను చెప్పేది. వాటికి ఉండే భేదం. మీకు తెలుసా? మీరు అనుకుంటున్నారా?
    వేరు వేరు అభిప్రాయాలు కలిగిన మనుషులు వేరు వేరు వ్యక్తులు. అభిప్రాయాలు ఏవైనా కావచ్చు. (మంచివీ చెడ్డవి) నేను చెప్పేది మానవతా విలువలు.
    మానవతావిలువలు కలిగిన మనిషి (ఆద్మి) ఇన్సాన్ అవుతాడని , అంటారని.

    రిప్లయితొలగించండి
  4. @ఇంజనీరింగు చదివిన చెడ్డ వాడు చెడ్డ ఇంజనీరు అవుతాడు
    @ప్రతి మనిషికీ తెలివితేటలకంటే మానవత్వము ముఖ్యము

    WELL SAID

    రిప్లయితొలగించండి
  5. please visit http://dhoommachara.blogspot.com for my new post

    రిప్లయితొలగించండి
  6. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  7. @పునర్వసు: ఇప్పటికి మీ పజిల్ లోని మిస్సింగ్ పేజీ చిక్కింది. "ఇన్సానియత్" అంటే మానవత్వం. అందుండేవాడే "ఇన్సాన్" అని చెప్పారన్నమాట. బాగుంది.
    ఇంతసేపూ నేను ఏమాలోచిస్తున్నానబ్బా! లగ్తాహై మేరా దిమాగ్ భీ ఖరాబ్ హోగయాహై

    రిప్లయితొలగించండి