23, జూన్ 2009, మంగళవారం

చెరువు - చెత్త

ఒక చెరువు. చాలా పెద్ద చెరువు. ఎంతో పురాతనమైనది. ఎప్పటినుండి ఉన్నదో ఎవరికీ తెలియదు. ఎన్నో తరాలుగా జనులు, పశు పక్ష్యాదులు, జలచరాలు, చెట్లు, అన్నిరకాల ప్రాణులు ఆనీటితో బ్రకుతున్నాయి. కాలక్రమేణా దానిలో బాగా చెత్త పేరుకు పోయింది. అందరూ, ఆచెత్త వల్ల వచ్చే వాసన, ఆనీటివల్ల వచ్చే రోగాలకు గురౌతున్నారు. జనులందరూ ఎన్నుకున్న ప్రభుత్వ వ్యవస్థ, కొన్ని చోట్ల నీతి శుద్ధి ఏర్పాట్లు చేసి కొంతమందికి ఆ నీటిని అందిస్తుంది.
చెత్త ఉందనే విషయం అందరికీ తెలిసినదే. దానికి కారణాలు కనిపెడదామని సంకల్పించారు కొందరు బుద్దిజీవులు. ఎక్కడెక్కడో వెతికారు, ఎంతో విషయ సేకరణ చేశారు, విశ్లేషించారు, క్రోడీకరించారు. తమ పరిశ్రమ ఫలాలను ప్రజలలోకి తెచ్చారు.
ఈ చెరువులోని చెత్త చాలాకాలమునుండి ఉన్నది. సుమారుగా కొన్ని వేల ఏళ్ళ నుండి ఉన్నది. దీనికి కారణాం ఒక పెద్ద మనిషి. ఆ చెరువును ఆ పెద్ద మనిషి తొవ్వించి ఉండవచ్చు, లేదా అప్పటికే ఉన్న చెరువుకు నాలుగు గట్లు తనకాలంలో ఏర్పాటు చేసి ఉండవచ్చు నని నేను బలంగా విశ్వసిస్తున్నాను అని ప్రజలముందుంచారు.
ప్రజలు ప్రశ్నించారు.
తమకంటే ముందు ఇలాంటి ప్రయత్నాలు చేసిన వారు వ్రాసి ఉంచిన సమాచారాన్ని తమ సిద్దాంతాలకు ఆధారాలని పరిశోధకులు వాక్రుచ్చారు.
ప్రజలలో వాదోపవాదాలు చెలరేగాయి. కొనసాగుతున్నాయి.
కళ్ళకు కనిపిస్తున్న చెత్తకు కారణం వెతకడం అవసరమా? చెత్త సమస్య(ల)కు కారణాలు కనిపెట్టడం సమస్య పరిష్కారమా?
నాకు తోచినది చెత్తను తొలగించడమే పరిష్కారమని, మరలా ఎవరూ చెత్త వేయకుండా అందరూ కృషి చేయాలని.
బుదజనులు వ్యాఖ్యానించ ప్రార్థన.

3 కామెంట్‌లు:

  1. కాస్త శ్లేష ద్యోతకమౌతుంది. చెత్త తొలగించటం తక్షణ కర్తవ్యం. కానీ మళ్ళీ పేరుకోకుండా చూడటం శాశ్వత పరిష్కారం. మధ్యేమార్గం అవలంబించాను అంటారా?

    రిప్లయితొలగించండి
  2. పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో కానీ పోదంటారు.చెత్తవేసే అలవాటున్నవారికి మీరు ఎన్ని నీతులు చెప్పినా చెవికెక్కుతాయంటారా !!! కొద్దిరోజులు బాగుంటారు మళ్ళీ మామూలే ఒకాయన తెచ్చి కొంత చెత్త వేస్తారు మళ్ళీ మామూలే చరిత్ర పునరావృతం

    రిప్లయితొలగించండి
  3. ఆ చెరువే ఈ ప్రపంచం. ఆ చెత్తే మనం రోజూ టీవీ లో చూసే వార్తలు!

    రిప్లయితొలగించండి