23, జూన్ 2009, మంగళవారం

మంచి - చెడు

ప్రక్కవాడికి మంచి, మనకు మంచి అనిపించక పోవచ్చు, మనకు మంచనిపించినది ప్రక్కవాడికి చెడ్డనిపించొచ్చు.
చేశేది, చేయాలనుకునేది మంచో చెడో చేసేవాడే ఆలోచించాలి. మరి మంచి, చెడులను నిర్ణయించడమేలా?
ఎక్కువ మందికి, ఎక్కువ కాలం ఎక్కువ సుఖాన్నిచ్చేది మంచి.
మనకు ఇతరులు ఎదిచేయకూదని మనము కోరుకుంటామో (అది చెడు). అది మనము ఇతరులకు చేయకూడదు.
ఇలాంటివి అన్ని మత గ్రంథాలలోను చెప్పారు.

2 కామెంట్‌లు:

  1. కొన్ని పదాల మార్పు చేర్పులతో క్లుప్తంగా ఇదే సందేశంతో నేనూ చదివానండి. మనం మంచి అనుకున్నది మనమాచరించి చూపి అది ప్రక్కవారిలోనూ ప్రభావాన్ని చూపేంతగా మనం లీనమవాలే కానీ "ఇలా చెయ్యి, ఇది మంచి, అది చెడు" అని ప్రయత్నించకూడదని నా అభిప్రాయం. ఎందుకంటే అప్పుడే ఎందుకు చేయాలి అన్న తర్కం మొదలవుతుంది. ఇది ఒకరి నుండి మరొకరికి సంక్రమించాల్సిన లక్షణం. విశ్వ మానవాళి విశ్వసించాల్సిన విషయం. "మంచి అన్నది పెంచుమన్నా వొట్టిమాటలు కట్టిపెట్టోయ్ గట్టిమేల్ తలపెట్టవోయ్! " - గురజాడ

    రిప్లయితొలగించండి