22, జూన్ 2009, సోమవారం

బ్లాగుల్లో గజ్జి బాధలు - నివారణోపాయాలు.

తెల్ల వాళ్ళ దేశంలో, తెల్లవాళ్ళకు నల్లవాళ్ళ మీద చిన్న చూపు, నల్లవాళ్ళకు తెల్లవాళ్ళమీద కోపం. (రంగు గజ్జి).
జర్మనీలో ఒక నియంత ఆర్యులు గొప్పవారు, అనార్యులు తక్కువ అని కెలికి ప్రపంచ యుద్దనికి కారణమయ్యారు. (తెగల గజ్జి).

భారత దేశంలో కూడా ఇలాంటివే రెండు రకాల గజ్జితో ప్రజలు బాధ పడుతున్నారనేది అందరికీ తెలిసిన విషయమే.

ప్రజలు పల్లెల నుండి పట్టణాలకు వస్తున్నారు, విద్యాధికత పెరిగింది, ప్రేమవివాహాలు పెరిగాయి, ఆర్థిక స్థితిగతులు మెరుగుపడుతున్నాయి.
వీటన్నిటి కారణంగా గజ్జి వ్యాప్తి కొంత తగ్గుముఖం పట్టిందని ఇతర బ్లాగర్లూ వ్యాఖ్యానిస్తున్నారు.

ఎవరికి వారు, వాళ్ళ గజ్జిని ఎవరూ చూడకుండా గోక్కుంటూ, అప్పుడప్పుడూ సారూప్య గజ్జి సోదరులతో కలిసి సామూహిక గోకుడు కార్యక్రమాలతో తమ తమ కుతి తీర్చుకుంటున్నారు, గజ్జి నివారణకూ, దాని కారణంగా ఉత్పన్న మవుతున్న ఇతర బాధలు పెరగ కుండా జాలింలోషన్ కొనుక్కుని వాడుకుంటున్నారు. ఇంతవరకూ ఎవరికి ఇబ్బందిలేదు. ఎందుకంటే గజ్జి అదుపులో ఉంది కాబట్టి.

ఈమధ్య విజ్ఞానాన్ని మధించి, ఔపోసన పట్టిన లోకహితాభిలాషులు గజ్జి పై పరిశొధనలు జరిపి, ఇది ఇప్పటి గజ్జి కాదు, ఈ గజ్జికి ఇంకొక గజ్జి కారణం, అది తల్లి, ఇది పిల్ల దీని పుట్టు పూర్వోత్తరాలు ఇవి, ఈ గజ్జి ఫలనా వారు సృష్టించారు, ఫలనా వారు విస్తరింపజేశారు, ఇవన్నీ చారిత్రక సత్యాలు, ఇవి మేము క్రొత్తగా చెప్పినవి కావు, మా గజ్జి మేము తెచ్చుకున్నది కాదు, ఇతర గజ్జి వారు, మమ్ములను విమర్శిస్తున్నారూ, అంటూ బహిరంగంగా తాము కనుగొన్న పాత సత్యాలను క్రొత్తగా వెలుగు పరచారు.

దీంతో మిగతా వారందరూ, బాహాటంగా ఒకరికొకరు గుడ్డలూడదీసి ఎవరికి ఎక్కువ గజ్జుందో చూడండంటూ కొలతలు మొదలు పెట్టారు.

ప్రభుత్వం వారుకూడా, గజ్జివారిని వారి వారి గజ్జి లక్షణాలు, వాటి పుట్టుపూర్వోత్తరాల పరంగా వర్గీకరిస్తూ, గజ్జి వ్యాప్తికి యథోశక్తి పాటు పడుతున్నారు. జాలింలోషన్ కొనుక్కోలేని కొంతమంది గజ్జి బాధితులకు ఉచితంగా సరపరా చేస్తున్నారు. కొంతమంది జాలింలోషన్ వినియోగము, పంపిణీలలోని అవకతవకల, సాధక బాధాకాల కారణంగా, మరింత శాస్త్రీయ గజ్జి పరిశోదన అవసరమనీ, మరింత వర్గీకరణా అవసరమనీ ప్రభుత్వంవారిని కోరుతున్నారు. దానిని ఇతర గజ్జి సోదరులు వ్యతిరేకిస్తున్నారు.

పై నేపథ్యంలో గజ్జి వ్యాప్తి నిరోధమూ, నివారణోపాయాలు:

1. ప్రభుత్వాలు మరింత శాస్త్రీయంగా శోధించి, గజ్జి, పుట్టుక లోని తేడాల ఆదారంగా మరింతగా వర్గీకరించి ప్రతి వర్గీకృత గజ్జికి ప్రత్యేక కోటా జాలింలొషన్ సరపరాలు చేసి గజ్జి బాధోపశమనం కలిగించాలా,
లేక
గజ్జికి ప్రభుత్యం గుర్తింపు లేదు, గజ్జి సమాజ దురాచారం. దానిని ఎవరూ తలచరాదు, వ్యాప్తిచేయరాదు అని రాజ్యాంగ మార్పు చేయాలా? ఇది ప్రభుత్వంవారు ఆలోచించాలి.

2. సమాజ శ్రేయస్సు దృష్ట్యా ఎవరూ ప్రక్క వారిని గజ్జి (గురించి) ప్రశ్నలు వేయకుండా, గజ్జి వ్యాప్తి నిరోధానికి పాటుపడాలి. కొండొకచో కొందరు పరమ(అ)జ్ఞానులు, గుల ఆపుకోలేక ఇలాంటివి బహిరంగ చర్చకు తెస్తే, అందరూ ముక్త కంఠంతో గజ్జి మనకు అవసరం లేదు అని చెప్పండి. గజ్జి కొట్లాటలకు పోకండి.

కొన్ని తరాలలో గజ్జి, దాని దుష్ప్రభావాలు పూర్తిగా పోతాయని (మన అదృష్టం బాగుంటే ఈ తరంలోనే అది జరుగుతుందని) ఆశిద్దాం. దాని సాధనకు అందరం కృషి చేద్దాం.

15 కామెంట్‌లు:

  1. >>"బాహాటంగా ఒకరికొకరు గుడ్డలూడదీసి ఎవరికి ఎక్కువ గజ్జుందో చూడండంటూ కొలతలు మొదలు పెట్టారు."

    హ హ హ నవ్వాపలేకపోతున్నా... :)))

    రిప్లయితొలగించండి
  2. > బాహాటంగా ఒకరికొకరు గుడ్డలూడదీసి ఎవరికి ఎక్కువ గజ్జుందో చూడండంటూ కొలతలు మొదలు పెట్టారు

    వామ్మో గజ్జి ఉన్నవాళ్ళ బట్టలు పట్టుకోవడమా? యాక్

    రిప్లయితొలగించండి
  3. అసలు "నాకు ఏ గజ్జి వుందో ఎంత ఉందో చూడండి...."" అని అనిపిస్తుంది కదండీ!!
    నా గజ్జి నాకు ఆనందం.
    నా గజ్జి మాత్రమే మిగిలిన గజ్జిల కన్నా ఎంతో తీటైనదీ, హాయినిచ్చేది.
    మరి ఇది నేను ప్రదర్శించాలంటే నేను ఎలా వుండాలంటారు?

    మీరు సెలవిస్తే బట్టలు ఉంచుకుని గోక్కోవాలో లేక ఊడదీయించుకుని గోక్కోవాలో ఆలోచిస్తాను.
    ఏమంటారు?

    రిప్లయితొలగించండి
  4. " కొంతమంది జాలింలోషన్ వినియోగము, పంపిణీలలోని అవకతవకల, సాధక బాధాకాల కారణంగా, మరింత శాస్త్రీయ గజ్జి పరిశోదన అవసరమనీ, మరింత "వర్గీకరణా" అవసరమనీ ప్రభుత్వంవారిని కోరుతున్నారు" :))

    రిప్లయితొలగించండి
  5. ఇప్పుడే అందినవార్త అందరి అభిప్రాయం మేరకు ప్రభుత్వం దీనిపై ఒక ఉన్నతస్థాయి కమిటీని ఆరోగ్యశాఖ మంత్రి అధ్యక్షతన ఏర్పాటు చేసారు దీనికి గానూ రెండు లక్షల కోట్లరూపాయలను కేటాయించారు.ఈ డబ్బును జాలింలోషన్ కొనుగోళ్ళకు,బాధితులకు లోషన్ ను పట్టించడంకోసం,ప్రభుత్వ అనధికార పత్రికలో ప్రచారం కోసం వినియోగిస్తారని తెలియచేసారు.

    రిప్లయితొలగించండి
  6. పొద్దు పొడిచింది
    పుస్తకం కాటేసింది
    మాయలాడి తెలుగాడిద తన్నింది

    రిప్లయితొలగించండి
  7. "పొద్దు పొడిచింది
    పుస్తకం కాటేసింది
    మాయలాడి తెలుగాడిద తన్నింది" :))

    రిప్లయితొలగించండి
  8. అబ్బకి దెబ్బ
    IP ADDRESS అమ్ముకు దొబ్బా

    రిప్లయితొలగించండి
  9. గజ్జి తామర చూడ నొక్క పోలికనుండు
    గోక గోక దురద మంటలు వేరు
    గజ్జిలందు కుల గజ్జిలు వేరయా
    బ్లాగులోక జనులు ఇసకేసి తోమ

    రిప్లయితొలగించండి
  10. సుత్తి గజ్జి కి తెలుగోకుడు హస్తం

    రిప్లయితొలగించండి
  11. జిల గజ్జిలు ఎన్ని ఉన్నను కుల గజ్జికి సాటిరావు గువ్వల చెన్నా

    Source: ఇల వృత్తులెన్ని ఉన్నను కుల వృత్తికి సాటిరావు గువ్వల చెన్నా

    రిప్లయితొలగించండి
  12. తెహల్క వీరుడు ఈ రోజు అదిరి పోయె రహస్యం బయట పెడతాడను కుంటె, కొత్త సినేమాలు లేనపుడు పాత సినెమా ని రెండవ సారి రీలిజ్ చేసిట్లు చెత్త టపా రాశాడు. వీరికి బాబా సినేమా సినేమా మరి ఒక సారి మద్దతు తెలిపారు. కే.సీ.ఆర్. హర్యానా లో యన్.డి.ఏ. కు మద్దతు తేలిపినట్లుగా...
    బా బా సినేమా సినేమా కు స్క్రీన్ షాట్ల భాగోతం గురించి తెలియదా? దానిని ఎలా సమర్ధిస్తారు వారు? బాబా గారు ఇది మీరు చదివుతారని ఆశీస్తాను, అలాగె మహేష్ ని ఏ విధం గా సమర్ధిస్తారు మీరు ఇప్పుడు?

    రిప్లయితొలగించండి