25, జూన్ 2009, గురువారం

బ్లాగులు ఎందుకు వ్రాస్తున్నాను - సమాజ స్పందన

21 వ శతాబ్దంలో, ప్రతివాడికి సెల్ ఫోను, కంప్యూటరు, ఇంటర్నెట్, బ్లాగూ సైటు ఆవశ్యకమై పోయాయి.
నేను ఈ మధ్యనే బ్లాగులోకంలోకి అడుగు పెట్టాను. నాకున్న కూసంత తెలుగు బాషాభిమానాన్ని గమనించిన ఒక మిత్రుడు, మీరెందుకు వ్రాయకూడదు అని తరచూ అడిగేవారు. చాలా కాలం నుంచి చాలా పుస్తకాలు చదివినా వ్రాయాలంటే ఏదో బెరుకు. అదే ఆమిత్రునితో అంటె, మొదట బ్లాగుల్లో ప్రయత్నంచు, వ్రాయడం బాగా సులువవుతుంది, అక్కడ అందరూ ఔత్సాహికులే అని భరోసా ఇచ్చారు.
ఇదేదో బాగుందే, అంత్రజాలంలో బ్లాగులోకం అంటూ, కొన్ని రోజులు కూడలినుంచి నాలుగు బజార్లు అటూ ఇటూ అంతా కలియ తిరిగాను.
జల్లెడ లొంచి చంద్రున్ని చూచ్తే చంద్రుడిలో బొక్కలు కనిపించాయి. అందరూ ఏమి వ్రాస్తున్నారు అని కనపడిన బ్లాగల్లా చదివాను.
చదవడం చాలా చకచకా సాగిపొయింది. ప్రతి బ్లాగూ ఒక క్రొత్త అనుభూతిని మిగిల్చింది, ప్రతిఒక్కరి నిరంతర పరిశ్రమ అందరికీ ఆనందదాయకమౌతుంటే ఈక్రొత్త సమాజం మానవ జాతి అభివృద్ది వేగిర పరుస్తుందని ఆనందపడ్డాను.
అప్పుడో చిన్న కలకలం.
ఒకరు వ్రాశారు. మరొకరు ప్రశ్నించారు. తిరిగి వ్యాఖ్య, దానికి ప్రతి వ్యాఖ్య, విమర్శ ప్రతివిమర్శ. వాదాలు వేడెక్కాయి.
క్రొత్త వాదాలు బయటపడ్డాయి. వర్గాలు ఏర్పడ్డాయి. వ్యంగ్య బాణాలు సందించారు, వ్యక్తిగత విమర్శల్లోకి దిగారు. చట్టాలు చూపారు, అంత్రజాల విలాసాలు వెతికారు. ముసుగు వీరుల నిజరూపాలివిగో అంటూ వార్తలు వెలువడ్డాయి.
ఇదేదో టీ కప్పులో తుఫాను అనుకుంటే, సునామీ దాకా వచ్చింది.
పెదరాయుళ్ళు పంచాయితీ నిర్వహిస్తున్నారు. సామరస్యంగా సాగుదామని మద్యమార్గుల చూచించారు.
కొందరు బ్లాగు వృద్దులూ, బ్లాగు శ్రేయోబిలాషులు, ఇరువర్గాలకు చూచనలిచ్చాయి. వ్యక్తిగత విమర్శలు, కుల మత ప్రస్తావనలు విడువ మన్నారు.
నాకు తోచినది చెప్పాలనిపించింది. అన్యాపదేశంగా జరుగుతున్నదానిని విమర్శింఛాను. నాకు తోచిన మంచిని చూచించాను. మంచంటే ఏంటని ప్రశ్నించారు. నాకు తెలిసినది చెప్పాను.
కొంచెం లోతుకు దిగి వెతకాలనుకున్నాను. ప్రశ్నించాను. జవాబిచ్చారు.
బ్లాగుల్లో రాతలకు సామాజిక ప్రయోజనం ఉందా లేదా అని ప్రశ్నలు తలెత్తాయి.
సామాజిక ప్రయోజనం ఆశించి వ్రాసెవాళ్ళు కొందరు, తమకోసం మాత్రమే వ్రాసేవాళ్ళు కొందరు లెక్క తేలారు.
సామాజిక ప్రయోజనం గురించి ఆలొచించక పోయినా ఇతరులకు కష్టం కలిగించే విషయాలు వ్రాయకపోతే చాలు అనుకున్నారు కొందరు.
బ్లాగుల్లో రాతలు సమాజం మీద ప్రభావం చూపిస్తాయా అనే కోణం తలెత్తింది.
మిగిలిన విషయాలేమోగాని, కులమతాలకు సంబందించినదైతే తప్పనిసరిగా ప్రభావితం చూపిస్తాయనిపించింది.
నాకు కొన్ని సంఘటనలు గుర్తొచ్చాయి. అవి.
కొన్ని సంవత్సరాల క్రితం రచయిత్రి తస్లీమా నస్రీన్ పై హైద్రాబాదు నడిబొడ్డులో దాడి జరిగింది. (ఇస్లాం ను విమర్శిస్తున్నారని. దాడి చేసిందీ ఆ వర్గీయులే).
ఏప్పటినుండో రచయిత సల్మాన్ రష్దీ పై ఫత్వా జారీ చేయబడినది (ఇస్లాం ను విమర్శిస్తున్నారని, ఆయనను చంపమని)
యూరప్ లో పత్రికల్లో అల్లాను కించపరుస్తూ వేసిన కార్టూన్ లు ప్రపంచ వ్యాప్తంగా అల్లరులు రేపాయి.
డావిన్సీ కోడ్ సినిమా భారత్ లో విడుదలచేయరాదంటూ కొందరు కోర్టుకెక్కారు.
పై సంఘటనలలో రచయితలు, కళాకారులు తమ తమ అభిప్రాయలు వెలిబుచ్చారు (అనే అనుకుందాము). మరి జనులెందుకు స్పందించారు?
నాకు అనిపించింది, బహిరంగంగా జరిగేవన్నీ సమాజంలో స్పందన కలగజేస్తాయని. దేనికి ఎంతగా స్పందిస్తారో కూడా అంచనావేయలేమని.
కనుక మనము వ్రాసుకునేది, వెలిబుచ్చేది మనకోసమేనైనా అది సమాజంలో ఎదో ఒక స్పందన కలిగిస్తుందని బ్లాగరులందరూ గమనించ ప్రార్థన.

25 కామెంట్‌లు:

  1. "మనము వ్రాసుకునేది, వెలిబుచ్చేది మనకోసమేనైనా అది సమాజంలో ఎదో ఒక స్పందన కలిగిస్తుందని"
    So very true.

    రిప్లయితొలగించండి
  2. "కులమతాలకు సంబందించినదైతే తప్పనిసరిగా ప్రభావితం చూపిస్తాయనిపించింది." మీకు మరొక కోణాన్ని చూపించాలనిపిస్తోంది. ఒక బ్లాగర్ చాలా నిష్టాపరుడు దైవభక్తిగలవారు. మొన్న ఆస్ట్రేలియాలోని భారతీయులపై దాడులు జరుగుతుంటే హనుమాన్ రక్షకట్టుకోండీ దాడులు తగ్గుతాయి అని తన తరఫునుంచీ ఒక సలహా ఇచ్చారు. దాని ఔచిత్యాన్ని ప్రశ్నించడం సులభం.కానీ ఎవరూ ప్రశ్నించలేదు. అదేదో తన నమ్మకం అని ఒదిలేసారు. అంటే మతానికి అనుకూలమైన సలహాలూ,ప్రతిపాదనలు ఎంత అనౌచిత్యంగా ఉన్నా మనలో చాలా మంది అంగీకరిస్తాం. కానీ వ్యతిరేకంగా తార్కికంగా ప్రశ్నిస్తే మాత్రం మనోభావాలు గాయపరుచుకుంటాం...ఇంతేగా! ఈ ద్వంద్వప్రవృత్తి ఎందుకు?

    సమస్య అక్కడే మొదలౌతుంది. అభివ్యక్తికి అవకాశం ఉన్నచోట అన్నిటికీ సమానమైన హోదా లభించాలి. సాంప్రదాయాలను శ్లాఘించేవారికీ వ్యతిరేకించేవారికీ కూడా సమానహక్కుండాలి. అవి చట్టాలకు లోబడి ఉండాలి. భారతీయ రాజ్యాంగానికి లోబడి ఉండాలి. నేను కోరుకున్నది, పోరాడుతున్నదీ అందుకోసమే.

    రిప్లయితొలగించండి
  3. sir, vishayam simple. if some one praises you, will you get angry even if he/she is a hype?.
    but if someone comments you in public even if it is a fact, you will not be happy.
    same thing holds for the religion you follow, poet you like , ideology you like.
    So while talking negative about something in public, YOU ARE SUPPOSED TO BE CAREFUL.
    LAW can't simply restrict everything. If you want to be in society, you want to get respect from that , you have to follow some rules.

    రిప్లయితొలగించండి
  4. కత్తి మహేష్ గారూ ,

    నేను భగవంతున్ని నమ్మే వాడిని. కనుక దాడులు జరుగుతున్నప్పుడు ,ఆస్తికులైనవారు భగవంతుని ఆశ్రయించమని ,భక్త రక్షకుడైన హనుమంతుని రక్షలు ధరించమని మనవారికి చెప్పాను. ఇందులో నా విశ్వాసమే కాని బలవంతమేమీ లేదు. ఇక రెండవవిషయం ఇందులో ఎవరి విశ్వాసాలను గాని ,నమ్మకాలను గానీ గాయపరచటం జరగలేదు. ఏ ఒక్కరికీ నామాటల వలన వీసమెత్తు బాధకూడా కలిగే అవకాశం లేదు.కనుక వ్యతిరేకించటానికి మామూలుగా ఎవరికీ కారణం కనిపించదు. రంధ్రాణ్వేషకులకు తప్ప. ఇక నేను ఈ దేశానికి ,ఇక్కడి సనాతన ధర్మానికి చెందినవాడిని కనుక మీలాంటివాల్లు అవమానించాలని ,హేళనచేసి మానసిక సంతృప్తి పొందాలని కోరుకుంటే తప్ప .ఎందుకంటే ఔచిత్యాలు ప్రశ్నించే విషయం లో కొందరికి లోపల కొన్ని భావాలుండి బయటకొకటి మాట్లాడతారు కనుక.ఉదాహరణకు మీరు ఆపోస్ట్ లో కామెంట్ చేశారు. అదే ముఖ్యమంత్రిగారు జెరూసలెం వెల్ల్లొచ్చి ప్రభువుని నమ్ముకోవటం వలననే వర్షాలు పడి దేశమ్ సుభిక్షం గావుందని వ్యాఖ్యానించి నప్పుడు ప్రతి దానికీ స్పందించి ఔచిత్యాలు ప్రశ్నించే మీనోరు పెగలలేదు .అది ఆయన నమ్మకం అని మేము సమర్ధించుకున్నాము .తప్ప ఔచిత్యాలు ప్రశ్నించలేదు. ఆ అవసరం కూడాలేదు.

    ఈరోజు వర్షాలకోసం అన్ని మతాలవారు ప్రత్యేక ప్రార్ధనలు ,పూజలు జరుపుతున్నారు .ఇందులో ఔచిత్యాలు ప్రశ్నించాల్సిన అవసరమేముంది . లోకానికి మేలుజరగాలని పదిమంది కలిసి భగవంతుని ప్రార్ధిస్తున్నారు తప్పేముంది.ఇలావుంటే ఏచర్య ఎవరికీ బాధకలగదు. కానీ ఇతరుల నమ్మకాలను హేళనచేస్తూ వున్న చదువును ఇలాంటి నీఛకార్యక్రమాలకోసం వృధాచెస్తూ ఇతరుల ను మానసికంగా బాధపెడుతున్న వారి మేధావితవం వలన లోకాని కేమి మేలు . నాకు తెలిసినది నేను వ్రాస్తాను అంటే ఎలా .సమాజం కొన్ని నిబంధనలతో పనిచెస్తుంది. నాఇష్టం నాకత్తి నా ఇష్టం వచ్చినట్లు తిప్పుతాను అని బజారు లో తిప్పటం మొదలు పెడితే అది సమాజనిబంధనలకు విరుధ్ధమేకాక ప్రమాదం కూడా . అతను మానసిక స్వాస్థతకలిగివుంటె అతనిని నేరస్తుడుగా తలచి జైలుకు తరలిస్తారు . మానసికంగా సరైన స్థితిలో లేకుంటే ఎక్కడికి తరలిస్తారో మీకుతెలుసు.

    రిప్లయితొలగించండి
  5. మరొక విషయం మరచి పోయాను. భారతీయులను వీరి నమ్మకాలను ,విశ్వాసాలను ఎగతాళి చేసి విమర్శించే వీలు భారతీయ రాజ్యాంగం లో వున్నదా? చట్టం మా విశ్వాసాలు గాయపరచినా ఏమీ పరవాలేదని చెబుతోందా ? నేను రాజ్యాంగాన్ని ,చట్టాలను వివరంగా తెలిసినవాడను కాదు.తెలిసిన వారు చెప్పండి . ఒక వ్యక్తికి బాధకలిగితే అతను చట్టాన్ని ఆశ్రయించి రక్షణ పొందగలిగినప్పుడు ,ఒకవ్యక్తి కోట్లాదిమంది మనోభావాలను చులకనచేస్తూ వ్రాతలు వ్రాస్తే అతనిని నిరోధించే చట్టాలు లేవా ? మీలో వున్న న్యాయనిపుణులు ఈ సందేహం తీర్చమని మనవి.

    రిప్లయితొలగించండి
  6. i agree with u

    manakosam raasukunedi dairy ila evaru ayataku pettaru........bajarulo nunchoni .....mana ishtam vachhinatlu maatladite padutara evarina idi alane.......
    katti gaaru ila loop holes vetakakandi...........

    రిప్లయితొలగించండి
  7. Hello Katti,

    If you are at home and alone, you can scold anybody and say anything about any god (Islam, Christian, Hindu, etc..,) nobody objection, that is your private. But, when you saying in Public domain, there is a law look over. Thats what happen to one boy, who written nonsense in the Internet about Sonia Gandhi, police arrested him...

    రిప్లయితొలగించండి
  8. @దుర్గేశ్వర్రావు: "ఇందులో నా విశ్వాసమే కాని బలవంతమేమీ లేదు." ఖచ్చితంగా నా పాయింటూ అదేనండి.నేను చేసేదీ అదే.

    నేను ఇప్పటివరకూ నా రాతల్లో చట్టాల్ని అతిక్రమించలేదు.నా నమ్మకాల్ని నేను చెబుతున్నాను. మీ నమ్మకాన్ని నేను గాయపరచలేదు.కొందమంతి తొందరపడి గాయపరుచుకుంటున్నారంతే. నా అభిప్రాయాల్ని భారతీయరాజ్యాంగానికి అనుగుణంగా వెలిబుచ్చుతున్నాను.ఏ న్యాయనిపుణుడి దగ్గరకెళ్ళినా మీకు ఇదే సమాధానం లభిస్తుంది.

    నేను చట్టాన్ని ఆశ్రయిస్తున్నది నాకు బాధకలిగిందని కాదు. చట్ట ఉల్లంఘన జరిగిందని. "కోట్లాదిమంది మనోభావాలను చులకనచేస్తూ" అనేది ఒక అపోహ. అంతకు మించి మరేదీ కాదు.

    రిప్లయితొలగించండి
  9. http://chaakirevu.wordpress.com koodaa raajakeeyaalu vadili deeni pai paddattu undhi.

    రిప్లయితొలగించండి
  10. ఇతరుల మతవిశ్వాసాల్ని ఉద్దేశపూర్వకంగా గాయపరిచేవాళ్ళని శిక్షించడం కోసం IPC 195 వ సెక్షన్ అని ఒకటుంది. మర్చిపోవద్దు.

    రిప్లయితొలగించండి
  11. అందుచేత ఇక్కడివారిలో ఒక వ్యక్తి హిందూమతాన్ని కించపరుస్తూ వ్రాసిన టపాలు రాజ్యాంగబద్ధం కావు.

    రిప్లయితొలగించండి
  12. @ Katti

    You said before about Vishnu as "Chillara Devudu", can you let us know who is your Chillara Devudu.. we love to know your Pedda Chillara Devudu.

    రిప్లయితొలగించండి
  13. @అజ్ఞాత: మీరు ఒక ముక్కలో చెబుతున్న నా వ్యాఖ్యని పూర్తిగా చూడండి.

    రిప్లయితొలగించండి
  14. నానమ్మకాన్ని నేను చెప్పినా అది ఇతరుల నమ్మకాలను .గాయపరచేది కాకూడదు . అది ఇంగిత జ్ఞానం. సమాజ న్యాయం.
    నేనేదో సమాజానికి భిన్నమైన వాడినని వారికంటె భిన్నంగా ఆలోచించగలనని ఊహించుకునేవారు ఒక విషయం గమనించాలి. సమాజమంతా అన్నం నోటిద్వారా తింటుంది కదా అని వేరొక చోటునుంచి తినాలని ప్రయత్నిస్తారేమో రేపు .అది వారిష్టమే కాదనం కానీదానిని సమాజం చూస్తూ సంతోషీంచలేదు.గౌరవించనూలేదు.
    వితండవాదాలతో మేధావిత్వం నిరూపించబడనూ లేదు.
    ఇంతకూ నేనడిగిన ఒక ప్రశ్న దాటవేస్తున్నారు. మీరు హిందువులపైన [మీరుకూడా హిందువునంటున్న్నారు. హిందూ ధర్మాన్నిఇంతగా అగౌరవపరచేమీరు ,చట్టబద్ధంగా,నైతికంగా హిందువెలా అవుతా్రు ఆరూపేణాలభించే ప్రత్యేకతలను పొందటానికి ఎలా అర్హత పొందుతారు.? నేను నైతికంగా ఎలా సనర్ధనీయమని అడుగుతున్నాలెండి.]మాత్రమే ఇలా ఔచిత్యాలు ప్రశ్నించే సత్కార్యం పెట్తుకున్నారా? ఎందుకంటే ఇతర మతాలజోలికి కూడా వెళ్ళె పని పెట్టికున్నారా? లేక ఇక్కడ విమర్శించే ప్రత్యేకఎజండా మీకు వున్నదా? జాగ్రత్త మేమంటె సహిస్తున్నాము కానీ ఇతరులజోలి కెల్లకండి ఆరోజుతో మీ కు అన్నిసందేహాలు తీరుపోతాయి. జ్ఞానోదయమయిపోతుంది.

    రిప్లయితొలగించండి
  15. దుర్గేశ్వరా, మీరంతటి వారు ఆ కుజాత గారి ఆప్త మిత్రుడు, బాబా గారి అంతరంగికుడు, మరువం భాషా గారు మద్దతు నిచ్చిన శ్రీ శ్రీ ఏకలింగ నామధేయులకి సామధానం ఇవ్వవలసిన అవసరం ఉందా అనేది నా ప్రశ్న? గంగా నాది లో కాలువ నీరు కలసినట్టు ఈ బ్లాగ్ లోకమ్ను కలుషితం చేయటానికి అవతరించిన వారు. ఆ కాలువకి అలా దారి ఇచ్చెయండి అంతే కాని శుభ్ర పరచాలని ప్రయత్నిచకండి. వారిని శుభ్ర పరచే భాధ్యత వారీ మిత్రులు చూసుకుంటారు.

    రిప్లయితొలగించండి
  16. ఈ మిత్రులు చాలా ఫీలౌతారు వారి హక్కుల గురించి, ఎప్పుడు చూడని పరువం భాషా గారు కర్ణశాలా కు వచ్చి మీకే నా మద్దతు అన్నవారు అలా మానిపులటే స్క్రిన్ షాట్ల గురించి బాబాగారు, పరువం భాషా నోరు మేదపరెందుకు???

    రిప్లయితొలగించండి
  17. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  18. దుర్గేశ్వర గారు

    సాత్త్వికులు, మీరు ఎందుకు మనసు పాడు చేసుకుంటారు? ఈ చర్చలు నిజం గానో కుల చర్చలో, మత చర్చలో లేక సైద్ధాంతిక విబేధాలో అయితే తప్పకుండా అటో ఇటో సంయమనం పాటించి ఇప్పటికి ఒకరినొకరు గౌరవించుకునే స్థాయిలో ఉండేవి.

    బాగా ఆలోచించిన మీదట తెలిసిందేమిటంటే- ఇవి కుల, మత సైద్ధాంతిక విబేధాలు కావు. అస్సలు కావు. కులం, మతం, సెక్సువాలిటీ, అభ్యుదయం ఇవన్నీ టూల్స్ మాత్రమే.

    ఇవే టూల్స్ ని విజ్ఞులు ఒకరకం గా ఉపయోగిస్తే, మూర్ఖులు మరో రకం గా ఉపయోగిస్తారు. ఇంతవరకూ బ్లాగుల్లో జరిగిన గొడవలు, Hatred వీటి వెనక కుల మత చెత్త లేదు. Its a reaaction to IDIOCY of HIMALAYAN PROPORTIONS. Period.

    ఈ వ్యాఖ్య నేను రాస్తున్నది మిమ్మల్నుద్దేశించి. మీకు నా సలహా - "జ్ఞానలవ దుర్విదగ్ధం..." అదీ సంగతి!

    For those who wish to respond to my comment:

    However provocative your comment might be, I am not going to permit myself to respond to it. Because my response would be an unnecessary acknowledgment of your existence.

    Prosecution rests . Period.

    రిప్లయితొలగించండి
  19. Hello Katti,

    Read your comments carefully following link.

    http://malakpetrowdy.blogspot.com/2009/06/blog-post.html

    on June 20, 2009 12:55 pm

    రిప్లయితొలగించండి
  20. పునర్వసు గారు, స్పందన సహజం, స్పందనకి మూలం అన్ని మాధ్యమాలూను, అందులో బ్లాగు ఒకటి. ఇంతకన్నా చలన చిత్రాల్లో సజీవ దృశ్యమాలికలు వుంటాయి, అవి చూసిన వారు ఎంత ప్రభావానికి లోనౌతున్నారు? ఇది ప్రశ్న కాదు, సాలోచన. వేటి ప్రభావం ఎంత అన్నది మీరన్నట్లు కొలవలేము. స్పందన ఒక చర్యగా మారటానికి మధ్యలో ఆయా వ్యక్తుల ఆలోచన శక్తి, పరిణితి, సమన్వయం కూడా పాత్ర వహిస్తాయి. వ్యక్తుల జిజ్ఞాసని బట్టి, ఆసక్తిని బట్టి చదవటం వ్రాయటం ఆధారపడివుంటాయి. చదువరికీ, రచయితకీ నడుమ వ్యక్తీకరణకి వారధి, ఆటంకం రెండూ ఒకటే ఆ రచన ప్రభావం, సద్విమర్శకి అవకాశం. వ్రాయటం ఆపటం, అదుపు చేయటం పరిష్కారం కాదు. ప్రభావాన్ని సమీక్షించుకోవటం, సద్విమర్శని అంగీకరించటం రెండూ ముఖ్యం. బ్లాగుల్లో కూడలి మాదిరి సందోహం ఎక్కువ కనుక సందడీ, రచ్చలు, చర్చలు, వాదోపవాదనలు అధికం. అవి ఆరోగ్యకరమే కదా, వ్యక్తి దూషణకి దిగనంతవరకు?

    రిప్లయితొలగించండి
  21. @అజ్ఞాత: "సమాజానికి అనుగుణంగా దేవుడే మారాడు!...వేదకాలంలో చిల్లర దేవుడిగా ఉండిన విష్ణువు పురాణకాలానికి నాలుగు చేతులతో శంఖుచక్రగధా పద్మాము ధరించి,వర్గ సమాజానికి ఆరాధ్యదేవత అయిన లక్ష్మికి మొగుడై,పాల సముద్రంలో (లేదా వైకుంఠంలో) చేరాడు."
    - కొడవటిగంటి కుటుంబరావు,
    వ్యాసం:జీవితాలు - దేవుడి పాత్ర
    పత్రిక: ప్రభంజనం పక్షపత్రిక
    తేది: 16.11.1972

    @దేవీపుత్ర దుర్గేశ్వర గారు; మీ నుంచీ ఇలాంటి స్పందన ఆశించలేదు. కనీసం మీలాంటివారు వీటికి అతీతం అనుకున్నాను. కానీ నిరాశే ఎదురయ్యింది. ఇక్కడ ఎవరు ఎవర్ని గేలిచేసారో,ఎవర్ని ఎవరు అవహేళనచేశారో కాస్త స్తిమితంగా ఉన్నప్పుడొచ్చు చదువుకుని తేల్చుకోండి.

    రిప్లయితొలగించండి
  22. మహేష్ కుమార్ గారు,
    మీరు ఏమి వ్రయాలనుకున్నారో గాని, ఏదో వ్రాసినట్లనిపిస్తుంది.
    >>"కులమతాలకు సంబందించినదైతే తప్పనిసరిగా ప్రభావితం చూపిస్తాయనిపించింది." మీకు మరొక కోణాన్ని చూపించాలనిపిస్తోంది.
    దీనికి మీ అబిప్రాయము తెలుపలేదు. విషయాన్ని ప్రక్కదారిపట్టిస్తున్నారు.

    >>ఒక బ్లాగర్ చాలా నిష్టాపరుడు దైవభక్తిగలవారు. మొన్న ఆస్ట్రేలియాలోని భారతీయులపై దాడులు జరుగుతుంటే హనుమాన్ రక్షకట్టుకోండీ దాడులు తగ్గుతాయి అని తన >>తరఫునుంచీ ఒక సలహా ఇచ్చారు. దాని ఔచిత్యాన్ని ప్రశ్నించడం సులభం.కానీ ఎవరూ ప్రశ్నించలేదు. అదేదో తన నమ్మకం అని ఒదిలేసారు. అంటే మతానికి అనుకూలమైన >>సలహాలూ,ప్రతిపాదనలు ఎంత అనౌచిత్యంగా ఉన్నా మనలో చాలా మంది అంగీకరిస్తాం. కానీ వ్యతిరేకంగా తార్కికంగా ప్రశ్నిస్తే మాత్రం మనోభావాలు >>గాయపరుచుకుంటాం...ఇంతేగా! ఈ ద్వంద్వప్రవృత్తి ఎందుకు?
    నమ్మినప్పుడు ప్రశ్నించాల్సిన అవసరం ఏమిటి. మనిషి బాధలో ఉంటే, ఉపశమనం కోసం చెప్పేది, అదికూడా మతవిశ్వాసాల్లో ఉన్నదే చెబితే అది అనౌచిత్యం ఏందుకౌతుంది?
    వారిని ఎందుకు ప్రశ్నించలేదని మీరు చెప్పడమేమిటి. మీ ప్రశ్నలు తార్కికమని మీరే కితాబిచ్చుకింటే సరిపోతుందా?

    >>సమస్య అక్కడే మొదలౌతుంది. అభివ్యక్తికి అవకాశం ఉన్నచోట అన్నిటికీ సమానమైన హోదా లభించాలి. సాంప్రదాయాలను శ్లాఘించేవారికీ వ్యతిరేకించేవారికీ కూడా >>సమానహక్కుండాలి. అవి చట్టాలకు లోబడి ఉండాలి. భారతీయ రాజ్యాంగానికి లోబడి ఉండాలి. నేను కోరుకున్నది, పోరాడుతున్నదీ అందుకోసమే.
    మీకూ అందరిలాగే బ్లాగులో మీ కామెంట్లు వ్రాయనివ్వడమే మీకు అందరితో పాటు ఇచ్చే సమాన హోదా. ఆ విషయంలో మీహక్కులకేమీ భంగం రాలేదే?
    మీరు వ్రాసినవి, నచ్చేదీ నచ్చనిదీ మాఅభిప్రాయము.

    >>నేను ఇప్పటివరకూ నా రాతల్లో చట్టాల్ని అతిక్రమించలేదు.నా నమ్మకాల్ని నేను చెబుతున్నాను. మీ నమ్మకాన్ని నేను గాయపరచలేదు.కొందమంతి తొందరపడి >>గాయపరుచుకుంటున్నారంతే. నా అభిప్రాయాల్ని భారతీయరాజ్యాంగానికి అనుగుణంగా వెలిబుచ్చుతున్నాను.ఏ న్యాయనిపుణుడి దగ్గరకెళ్ళినా మీకు ఇదే సమాధానం >>లభిస్తుంది.
    దీనికి IPC 195 వ సెక్షన్ అని ఎవరో వ్రాశారు చూసుకోండి, ఆ చట్టమేమి చెబుతుందో.

    రిప్లయితొలగించండి
  23. దుర్గేశ్వర గారు,

    హనుమత్ రక్షలు ధరించడం వల్ల బాధలు తగ్గడం అనేది ఒక నమ్మకం. ఇందువల్ల ఒకరికి నష్టం లేదు. మీకు నచ్చినది మీరు చేస్తున్నారు. అందువల్ల మీరు అసలు సమాధానం చెప్పనవసరమే లేదు.

    రిప్లయితొలగించండి
  24. @పునర్వసు: సెక్షన్ 195 తప్పుడు సాక్ష్యాలకు సంబంధించింది.సెక్షన్ 295-297 మతానికి సంబంధించినవి. అవికూడా defying place of worship,distrurbing religious assemply,tresspassing కు సంబంధించినవి. కాబట్టి చట్టాన్ని గురించి చెప్పే ముందు సమాచారాన్ని సరిచూసుకోగలని మనవి.

    ఇక్కడ వ్యాఖ్యల రూపంలో నేను రాయాలనుకున్నదే రాశాను. మీకు కావలసిన విధంగా మీరు అర్థం చేసుకున్నారు. అంతే తేడా. మీరు నిర్వచించిన "ప్రభావం" relative అనేందుకు నేను ఉదాహరణ ఒకటి ఇచ్చాను. అది మీకు అర్థమయ్యింది. కానీ ఒప్పుకోవడానికి ఇష్టం లేదు. అందుకని మీరుదాన్నొక "పక్కదారిపట్టించడాన్ని" చేస్తున్నారు. Understandable.

    మీరు "నమ్మకం" అని కితాబిచ్చుకోంగా లేనిది "తార్కికం" అని నానమ్మకాన్ని చెప్పుకుంటే ఎవరిదో approval కావాలా? మీరు మతవిశ్వాసాల్లో ఉన్నది చెబితే నేను హేతువాద ధృక్పధంలోంచీ చూసి సూచిస్తున్నాను. I am still not prescribing, I am only suggesting.

    నేను రాసినవి నచ్చకపోతే ఎందరో అభిప్రాయాలు చెబుతున్నారు. వాళ్ళందరితోనూ నేను "రాయద్దు" అని చెప్పట్లేదే. కానీ ఇక్కడ కొందరు నేనలాంటివి "రాయకూడదు" అని శెలవిస్తున్నారు. ఆ అధికారం లేదనే నేను చెబుతున్నది.

    రిప్లయితొలగించండి
  25. punarvasugaaru mee mail id kaavaali meeto sampradimchaali pampagalaru

    durgeswara@gmail.com

    రిప్లయితొలగించండి