21, జూన్ 2009, ఆదివారం

వెర్రి కుదిరింది.

వెర్రికుదిరింది, రోకలి తలకు చుట్టమన్నాడట వెనకటికెవడో. చదవేస్తే ఉన్నమతి పోయిందట. చదువుద్వారా పెంచుకున్న తెలివితేటలను, సమాజ అభివృద్దికి వినియోగించాలిగాని, ఎక్కడేక్కడో ఎవరెవరో వ్రాసినవి ఉటంకిస్తూ చేసే భావస్కలనం గొప్ప విద్యాలయాలో చదివిన గొప్ప విద్యలకు పరమార్థం కారాదు. కష్టాలు పడ్డ ప్రతి ఒక్కడికీ, కష్టాలకు కారణాలు తెలుసు. కాని పరిష్కారం చెప్పగలగడమే చదువు యొక్క పరమార్థం. మంచిచేయకపోతే పరవాలేదు, చెడు మాత్రం చేయకు అనేది మానవాళి సుఖసంతోషాలకు మూల సూత్రం. గుండమ్మ కథ సినిమాలో N.T.R అన్నట్లు ఏదైనా సమస్య వస్తే కద్దోయాలి గాని, విడదీయాలని చూడకూడదు.

సమస్యలకు కారణాలు వెతకడం సమస్యకు పరిష్కరం కాదు. సమస్యకు మూలాలు వెదికి దానికి కారణం ఫలానా అని తేల్చి దానిని ప్రచారం చేయడమూ పరిష్కారం కాదు. ప్రచారాలు విద్వేషాలు పెంచేవేగాని, సమస్యలను రూపుమాపలేవు.

వీలైతే పరిష్కారాలు సూచించండి, ఆచరించి చూపించండి. నిందలతో, విమర్శలతో మనమెప్పుడూ వేరొకరి మనసు గేలవలేము. ప్రేమతో విషమయినా తినిపించగలము గాని, ద్వేషముతో అమృతము కూడా రుచిచూపించలేము.

ఒక రచయిత అన్నట్లు, రచయితలు వ్రాసేవన్ని చేయకూడదు, చేసేవన్ని వ్రాయకూడదు. ఉదాహరణకు, రచయిత తన సెక్సు జీవితం గురించి వ్రాయకూడదు, తన రచనలలో వ్రాసే దొంగతనాలు వగైరా చేయకూడదు. అదీ social commitment. నలుగురిలోకి వెళ్ళి నాయిష్టమొచ్చినట్లుంటాను అనేది సమాజ వ్యతిరేకం.

బ్లాగరులందరూ యివి గమనించ ప్రార్థన.

6 కామెంట్‌లు:

  1. తురీయం అంటే అర్ధం ఏంటి సారూ?
    కామెంట్సు లో వర్డ్ వెరిఫికేషన్ తీసివేస్తారా?

    రిప్లయితొలగించండి
  2. నలుగురిలోకి వెళ్ళి నాయిష్టమొచ్చినట్లుంటాను అనేది సమాజ వ్యతిరేకం.
    you are absolutely... absolutely right!!!

    రిప్లయితొలగించండి
  3. బాగా చెప్పరు మాస్టారు!..
    మీరు చెప్పింది ముమ్మాటికీ నిజం.

    రిప్లయితొలగించండి
  4. బాగా చెప్పారు మాస్టారు...!

    "తుర" అంటే అమ్ములపొది. "తురీయం" అంటే బాణం అనుకుంటా...

    రిప్లయితొలగించండి
  5. తురీయం అనగా నాల్గవ భాగము అని అర్థము. తురీయావస్థ అనగా నాల్గవ అవస్థ. బ్రహ్మావస్థ. మిగిలిన మూడు అవస్థలు, జాగృత్, స్వప్న, షుషుప్తావస్థలు. అంబులపొదిని తూణీరము అంటారని నకు గుర్తు. అదిగి నందుకు నెనరులు.

    రిప్లయితొలగించండి