22, జూన్ 2009, సోమవారం

రామలింగడు - మామిడి పండ్లు

కృష్ణదేవరాయలు గారు ఒక సారి సభలో వారందరిని యిలా అడిగారు. " మా తల్లిగారు, చనిపోయే ముందు ఆకరి కోరికగా మామిడి పండ్లు తినాలని ఉంది తెప్పించు అని. కాని అది చలికాలం. రాజునైయుండి కూడా ఆమె కోర్కె తీర్చ లేక పోయాను. ఆవిడ ఆత్మ శాంతికి ఏమి చేయాలో ఎవరైనా సలహా చెప్పండి ".

అప్పుడు కొందరు పండితులు, బాధ పదకండి రాజా, ఇది చాలా సులభం. మీ అమ్మ గారి పేరుమీద మనిషికి రేండు బంగారు మామిడి పండ్లు పంచండి. దానితో ఆవిడ ఆత్మ సాంతిస్తుంది అని.

రాజు గారు ఖజానా లోని బంగారమంతా, బంగారు మామిడి పండ్ల తయారీకి వినియోగించారు. ఆరోజు రానేవచ్చింది. అందరూ ఐకమత్యంగా వరసలు దీరి నిలుచున్నారు బంగారు మామిడి పండ్ల కోసం. అంతలో రామలింగడు వచ్చి మహారాజా, నాదొక మనవి, మీ తల్లి ప్రేమ చాలా గొప్పది. మా తల్లి గారు కూడా ఈ మద్యనే కాలం చేశారు, ఆవిడ ఆఖరి కోర్కె తీర్చడం నా బాధ్యత. కనుక దయచేసి మీవద్ద పండ్లు పుచ్చుకున్న వారిని నా దానం కూడా గ్రహించమని ఆజ్ఞాపించండి. రాయలు వారు అలాగే ఆజ్ఞాపించి, రామలింగా మీ తల్లిగారి చివరి కోర్కె ఏమిటి అని అడిగారు.
మా తల్లిగారికి మోకాళ్ళ నొప్పులు ఉండేవి, చాలా వైద్యాలు చేయించాను, ఏదీ పనిచేయలేదు, వాతం తగ్గడానికి వళ్ళంతా వాతలు పెట్టించుకోమని ఎవరో చెబితే నన్ను వాతలు పెట్టించ మంది. చూస్తూ చూస్తూ, కన్నతల్లికి ఎలా వాతలు పెట్టించడమా అని సంశయించాను, ఈలోగా ఆవిడ ఆఖరి కోరిక తీరకుండా చనిపోయారు. కనుక మీ రెండు బంగారు మామిడి పండ్లతో పాటు, నా పది వాతలు గ్రహించాలి ప్రభూ.

నీతేంటంటే, ఏ రూలైనా అందరికీ సమానమే.

21, జూన్ 2009, ఆదివారం

విజ్ఞత

యథా రాజా తథా ప్రజా! పేరుకి సెక్యులర్ దేశం, కానీ దేవాదాయ శాఖలుండే ప్రభుత్వాలు. ఆదాయాలకు హిందూమతపు గుడులు కావాల్సి వచ్చిన ప్రభుత్వాలు, మక్కా యాత్రకు సబ్సిడీలు ఇస్తుంది. (జెరూసలేం యాత్రకు కూడా సబ్సీడీ ప్రతిపాదనలేమయినా ఉన్నాయేమో). చదువులకూ, ఉద్యోగాలకూ అవసరమయ్యే రిజర్వేషనులకు మూలమయిన కులవ్యవస్థ కావాలి, దానికి ఆదారమంటూ ఘోషిస్తున్న హిందూమతము మాత్రము చెడ్డది అని వాదించే ప్రజ. హిందూమతమును విమర్శించడానికి ఎవరయినా అర్హులే అనే అభిప్రాయము, ఆ అభిప్రాయాలను ప్రశ్నించే వారిని రాజ్యాంగ హక్కులను చూపించి బెదిరించే విజ్ఞత. బాగుందండీ వాదన. దీనిని విజ్ఞులయిన బ్లాగరులే గ్రహించ గలరు.

వెర్రి కుదిరింది.

వెర్రికుదిరింది, రోకలి తలకు చుట్టమన్నాడట వెనకటికెవడో. చదవేస్తే ఉన్నమతి పోయిందట. చదువుద్వారా పెంచుకున్న తెలివితేటలను, సమాజ అభివృద్దికి వినియోగించాలిగాని, ఎక్కడేక్కడో ఎవరెవరో వ్రాసినవి ఉటంకిస్తూ చేసే భావస్కలనం గొప్ప విద్యాలయాలో చదివిన గొప్ప విద్యలకు పరమార్థం కారాదు. కష్టాలు పడ్డ ప్రతి ఒక్కడికీ, కష్టాలకు కారణాలు తెలుసు. కాని పరిష్కారం చెప్పగలగడమే చదువు యొక్క పరమార్థం. మంచిచేయకపోతే పరవాలేదు, చెడు మాత్రం చేయకు అనేది మానవాళి సుఖసంతోషాలకు మూల సూత్రం. గుండమ్మ కథ సినిమాలో N.T.R అన్నట్లు ఏదైనా సమస్య వస్తే కద్దోయాలి గాని, విడదీయాలని చూడకూడదు.

సమస్యలకు కారణాలు వెతకడం సమస్యకు పరిష్కరం కాదు. సమస్యకు మూలాలు వెదికి దానికి కారణం ఫలానా అని తేల్చి దానిని ప్రచారం చేయడమూ పరిష్కారం కాదు. ప్రచారాలు విద్వేషాలు పెంచేవేగాని, సమస్యలను రూపుమాపలేవు.

వీలైతే పరిష్కారాలు సూచించండి, ఆచరించి చూపించండి. నిందలతో, విమర్శలతో మనమెప్పుడూ వేరొకరి మనసు గేలవలేము. ప్రేమతో విషమయినా తినిపించగలము గాని, ద్వేషముతో అమృతము కూడా రుచిచూపించలేము.

ఒక రచయిత అన్నట్లు, రచయితలు వ్రాసేవన్ని చేయకూడదు, చేసేవన్ని వ్రాయకూడదు. ఉదాహరణకు, రచయిత తన సెక్సు జీవితం గురించి వ్రాయకూడదు, తన రచనలలో వ్రాసే దొంగతనాలు వగైరా చేయకూడదు. అదీ social commitment. నలుగురిలోకి వెళ్ళి నాయిష్టమొచ్చినట్లుంటాను అనేది సమాజ వ్యతిరేకం.

బ్లాగరులందరూ యివి గమనించ ప్రార్థన.

భావస్కలనం

బ్లాగులు భావ వ్యక్తీకరణకు వేదిక కావాలిగాని, భావస్కలనాలను సమర్దించుకోవడానికి కాకూడదు.

6, జూన్ 2009, శనివారం

జీవితం

జీవితం చాలా సరళం
దాన్ని నీవు క్లిష్టంగా మార్చుకోక పోతే.